లాలి లాలి జొలాలి అంటు లాలించాలి ఈ గాలి లాలి లాలి జొలాలి వింటు లొకాలన్నీ ఊగాలి నీతో ఆడలంటు నేల జారెనంట జాబిల్లి నీలా నవ్వాలంటు తెల్లవారె చుసెనంట సిరిమల్లి
లాలి లాలి జొలాలి అంటు లాలించాలి ఈ గాలి లాలి లాలి జొలాలి వింటు లొకాలన్నీ ఊగాలి
బొసి పలుకె నువు చిందిస్తుంటె బొమ్మరిల్లాయె వాకిలి లేత అడుగె నువు కదిలిస్తు ఉంటె లేడి పిల్లాయె లోగిలి నీ చిన్ని పెదవంటితె అలనదులెన్నొ యెదలోన పొంగే పొరలి నిను కన్న భాగ్యనికే తల్లి పదవొచ్చి మురిసింది ఇయ్యాలె
లాలి లాలి జొలాలి అంటు లాలించాలి ఈ గాలి లాలి లాలి జొలాలి వింటు లొకాలన్నీ ఊగాలి
లాల నీకె నె పొసెటివెల అభిషేకంలా అనిపించెర ముద్ద నీకె నె కలిపేటి వేల నైవెద్యంలా అది ఉంది ర సిరిమువ్వ కట్టేవెలా మాకు శివ పూజె గురుతొచ్చె మరలా దొరలా కెరింత కొట్టె వేలా ఇల్లె కల్యాణంలా మారె నీవల్ల
లాలి లాలి జొలాలి అంటు లాలించాలి ఈ గాలి లాలి లాలి జొలాలి వింటు లొకాలన్నీ ఊగాలి